PowerPoint Presentation

1 of
Published on Video
Go to video
Download PDF version
Download PDF version
Embed video
Share video
Ask about this video

Page 1 (0s)

[Audio] పండుగ పేరు : రొట్టెల పందుగ హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెలపండుగ ఒకటి. ఇది నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. దీనిని ప్రతి సంవత్సరం మొహర్రం నెలలో నెలవంక కనిపించిన పదకొండవరోజు నుండి మూడురోజుల పాటు నిర్వహిస్తారు. ఈ రొట్టెలపండుగలో మనరాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా కులమతాలకు అతీతంగా లక్షలాదిగా ప్రజలు పాల్గొంటారు. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్కాటు నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది. ఆ రోగనివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులకు ఈ పన్నెండుమంది యుద్ధవీరులు కలలో కనిపించారు. సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిపారు. ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆస్థానంలోని రాజగురువుకి చేరవేసారు. రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్న నవాబు బారాషహీద్ నుండి మట్టి తీసుకువచ్చి తన భార్యకు లేపనం చేస్తాడు. దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది.దీనికి కృతజ్ఞతగా ఆర్కాటు నవాబు భార్యా సమేతంగా బారాషహీద్ను సందర్శిం చాడు. ప్రార్ధనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు. అక్కడ ఉన్న ప్రజలకు ఆ రొట్టెలు పంచాడు. బారాషహీద్ దర్గాను అభివృద్ధి చేసాడు. అప్పటి నుండి ప్రజలు తమకు ఎలాంటి కోరికలు ఉన్నా బారహ్ షహీద్ దర్గాను సందర్శించడం ప్రారంభించారు. వారి కోరిక తీరితే తర్వాత సంవత్సరం దర్గాను సందర్శించి రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు. అలా కోరిక తీరినవారు మరుసటి సంవత్సరం జాతరకు వస్తారు. రొట్టెల పండుగ నాడు వారు తెచ్చిన రొట్టెలను ఇతరులతో పంచుకుంటారు. రొట్టెల పండుగ మొదటిరోజు షహదత్తో ప్రారంభమువుతుంది. రెండవరోజు గంధోత్సవం జరుగుతుంది. గంధోత్సవంలో భాగంగా కోటమిట్టలోని అమీనియా మసీదు నుండి గంధాన్ని తీసుకువస్తారు. ఈ 12 సమాధులకు గంధం పూస్తారు. మిగిలిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మూడవరోజు రొట్టెలపండుగ. ఆ రోజు భక్తులు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కుంటారు. పండుగ పేరు : రొట్టెల పందుగ హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెలపండుగ ఒకటి. ఇది నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. దీనిని ప్రతి సంవత్సరం మొహర్రం నెలలో నెలవంక కనిపించిన పదకొండవరోజు నుండి మూడురోజుల పాటు నిర్వహిస్తారు. ఈ రొట్టెలపండుగలో మనరాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా కులమతాలకు అతీతంగా లక్షలాదిగా ప్రజలు పాల్గొంటారు. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్కాటు నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది. ఆ రోగనివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులకు ఈ పన్నెండుమంది యుద్ధవీరులు కలలో కనిపించారు. సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిపారు. ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆస్థానంలోని రాజగురువుకి చేరవేసారు. రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్న నవాబు బారాషహీద్ నుండి మట్టి తీసుకువచ్చి తన భార్యకు లేపనం చేస్తాడు. దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది.దీనికి కృతజ్ఞతగా ఆర్కాటు నవాబు భార్యా సమేతంగా బారాషహీద్ను సందర్శిం చాడు. ప్రార్ధనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు. అక్కడ ఉన్న ప్రజలకు ఆ రొట్టెలు పంచాడు. బారాషహీద్ దర్గాను అభివృద్ధి చేసాడు. అప్పటి నుండి ప్రజలు తమకు ఎలాంటి కోరికలు ఉన్నా బారహ్ షహీద్ దర్గాను సందర్శించడం ప్రారంభించారు. వారి కోరిక తీరితే తర్వాత సంవత్సరం దర్గాను సందర్శించి రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు. అలా కోరిక తీరినవారు మరుసటి సంవత్సరం జాతరకు వస్తారు. రొట్టెల పండుగ నాడు వారు తెచ్చిన రొట్టెలను ఇతరులతో పంచుకుంటారు. రొట్టెల పండుగ మొదటిరోజు షహదత్తో ప్రారంభమువుతుంది. రెండవరోజు గంధోత్సవం జరుగుతుంది. గంధోత్సవంలో భాగంగా కోటమిట్టలోని అమీనియా మసీదు నుండి గంధాన్ని తీసుకువస్తారు. ఈ 12 సమాధులకు గంధం పూస్తారు. మిగిలిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మూడవరోజు రొట్టెలపండుగ. ఆ రోజు భక్తులు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కుంటారు..