జ్ఞాన సిద్ధాంతం:

Published on Slideshow
Static slideshow
Download PDF version
Download PDF version
Embed video
Share video
Ask about this video

Scene 1 (0s)

జ్ఞాన సిద్ధాంతం:. తత్వశాస్త్రంలో, జ్ఞాన సిద్ధాంతం అనేది జ్ఞానం యొక్క మూలం, స్వభావం మరియు వచ్చిన జ్ఞానం యొక్క సత్యాసత్యాలను నిర్ణయించుటను అధ్యయనం చేస్తుంది..

Scene 2 (10s)

జ్ఞాన సిద్ధాంతం. జ్ఞాన సిద్ధాంతం యొక్క ఆవశ్యకత ఏమిటి? జ్ఞాన సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మూలం గురించి తెలుసుకోవడం మరియు మానవుడు కలిగి ఉన్న జ్ఞానం యొక్క స్వభావం మరియు పరిమితులను అర్థం చేసుకోవడం. జ్ఞానము ఎలా కలుగుతుంది? జ్ఞానం ఏర్పడుతున్న క్రమము ఏమిటి? వచ్చిన జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది ? వచ్చిన జ్ఞానం సరైనదే నని ఎలా నిర్ధారించగలము?.

Scene 3 (26s)

జ్ఞాన సిద్ధాంతం యొక్క ఆవశ్యకత ఏమిటి?.

Scene 4 (33s)

జ్ఞాన సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. జ్ఞానం అంటే ఏమిటి? విషయాలను గురించి మనకు తెలిసిన దానినే జ్ఞానం అంటారు. ఏదో ఒక విషయాన్ని గురించిన అనుభూతి కలగటాన్ని జ్ఞానం (తెలియడం) అంటారు. ఆయా విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? తెలిసినదంతా సరైనదేనా? అని తేల్చుకోవడం ఎలా? అలా తేల్చుకోకుంటే వచ్చే నష్టం ఏమిటి? వంటి ప్రశ్నల గురించి మనం చర్చించాలంటే ముందుగా జ్ఞానం ఏర్పడుతున్న క్రమం తెలుసుకోవాల్సి ఉంది..

Scene 5 (50s)

జ్ఞానం ఏర్పడుతున్న క్రమం. జ్ఞానము ఎలా కలుగుతుంది? “ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం” అనగా ఇంద్రియంతో విషయానికి సంబంధం ఏర్పడినప్పుడు ఆయా విషయాలు మనకు తెలియబడతాయి. మనకు జ్ఞానము ఆరు ఇంద్రియముల ద్వారా కలుగుతుంది. జ్ఞానం ఏర్పడుతున్న క్రమము.

Scene 6 (1m 8s)

జ్ఞానం ఏర్పడుతున్న క్రమం. abstract. abstract.

Scene 7 (1m 16s)

జ్ఞానేంద్రియాలు ఎన్ని?. జ్ఞానేంద్రియాలు ఆరు. అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక మరియు మనసు. జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడేవి : 1. కంటి ద్వారా : రంగులు, రూపాలు, పరిమాణాలు, (లావు-సన్నం, పొట్టి-పొడవు) చలనాలు, (పనులు, కదలికలు) వగైరా.. 2. ముక్కు ద్వారా: రకరకాల వాసనలు సువాసనలు దుర్గంధాలు 3. నాలుక ద్వారా: రకరకాల రుచులు అంటే ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు వగైరా.. 4. చెవి ద్వారా: రకరకాల శబ్దాలు (అర్థయుక్త అర్థరహిత) 5. చర్మం ద్వారా : స్పర్శ, చల్లదనం, వెచ్చదనం, మెత్తదనం, గట్టి, గరుకు మొదలైనవి 6. మనసు ద్వారా: తృప్తి అసంతృప్తి, భయం, ధైర్యం, శాంతి, అశాంతి, ప్రేమ, ద్వేషం మొదలైనవి.

Scene 8 (1m 46s)

ప్రమాణ వివేచన:. ఏర్పడిన జ్ఞానం ఎలా ఏర్పడిందో? అది ఎలాంటి జ్ఞానమో? దానిపై మనం ఎంతవరకు ఆధార పడాలో? తెలుసుకోవడానికి ప్రమాణ వివేచన అవసరమౌతుంది..

Scene 9 (1m 56s)

ప్రమాణములు:. పరికరములను అనుసరించి ప్రమాణములు ఆరు.

Scene 10 (2m 9s)

జ్ఞానములో రకాలు. జ్ఞానము రెండు రకాలు 1. ప్రత్యక్ష జ్ఞానము 2. పరోక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానము మరలా రెండు విధములుగా ఉంది. 1. అనుమాన ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము 2. శబ్ధ ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము.

Scene 11 (2m 23s)

ప్రత్యక్ష జ్ఞానము. ప్రత్యక్ష ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానము. అనగా ఏయే ఇంద్రియాల ద్వారా ఏయే విషయాలు తెలియబడాల్సి ఉందో, ఆయా ఇంద్రియాల ద్వారానే ఆయా విషయాలు తెలియబడితే ; అలా కలిగిన జ్ఞానమే “ ప్రత్యక్ష జ్ఞానము” అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. లోపలికి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నామా? బయట ఉన్న విషయాన్ని గమనిస్తున్నామా? అన్నది పరిశీలిస్తే లోపల చేరిన దాన్ని గమనిస్తున్నామని తెలుస్తుంది. కొద్ది దూరం లో ఒక పుస్తకం ఉంది. అది ఒక ఆకారంలోనూ,ఒక పరిమాణంలోనూ, ఏదో ఒక రంగును కలిగి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ పుస్తకానికి మన కంటికి మధ్య రంగు అద్దాన్ని పెట్టి చూస్తే ఆ పుస్తకం రంగు మారినట్లు అనిపిస్తుంది. భూతద్దాన్ని పెట్టి చూసినట్లైతే పుస్తకం పరిమాణము ఉన్నదాని కంటే పెద్దదిగా కనిపిస్తుంది. గరుకు తలం కలిగిన అద్దాన్ని పెట్టినట్లైతే వస్తువు వంకరటింకరగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రయోగాలను బట్టి, వస్తువు నుంచి కంటి ద్వారా మెదడుకు సమాచారము ఏ రీతిలో చేరితే, ఆ రీతిలోనే వస్తువు కూడా ఉంది అన్న భావాన్ని కలిగిస్తాయి..

Scene 12 (2m 55s)

పరోక్ష జ్ఞానము. ఏయే ఇంద్రియాల ద్వారా ఏయే విషయాలు తెలియబడాల్సి ఉందో, ఆయా ఇంద్రియాల ద్వారా కాకుండా ఇతర ఇంద్రియాల ద్వారా విషయాలు తెలియబడితే ; అలా కలిగిన జ్ఞానమే “ పరోక్ష జ్ఞానము” అవుతుంది. ఉదాహరణకు రంగు అనేది కన్ను ద్వారా తెలియబడే జ్ఞానం. కానీ ఒక వస్తువు రంగు ఎవరైనా చెప్పడం ద్వారా తెలిస్తే అలా కలిగిన జ్ఞానము పరోక్ష జ్ఞానము అవుతుంది. పరోక్ష జ్ఞానము రెండు పద్ధతులలో కలిగే అవకాశం ఉంది. ఏదైనా ఆధారంతో ఊహించడం ద్వారా గానీ ఎవరైనా చెప్పడం ద్వారా కలుగవచ్చు. ఆధారంతో ఊహించడం ద్వారా జ్ఞానం కలిగే పద్ధతినే “అనుమాన ప్రమాణం” అంటారు. ఎవరైనా చెప్పడం ద్వారా జ్ఞానం ద్వారా కలిగే పద్ధతినే “శబ్ద ప్రమాణం” అంటారు..

Scene 13 (3m 19s)

అనుమాన ప్రమాణము. “లింగ పరామర్శ జన్యం జ్ఞానం అనుమితి” ఇక్కడ లింగం అంటే హేతువు లేక ఆధారమని అర్థం. ఒక ఆధారం ద్వారా దానితో సంబంధం గలిగిన వేరొక దాని ఉనికిని ఊహించడం వలన జ్ఞానం కలిగే పద్దతిని “అనుమాన ప్రమాణము” ఏది తెలియటం వల్ల తెలియని దానిని ఊహించుటకు వీలు అవుతుందో; దానికి తెలియబడినది హేతువు అవుతుంది. మనకి ఏదో తెలుస్తున్నంత మాత్రాన మరేదో తెలియని దానిని ఊహించటం ఎలా సాధ్యపడుతుంది? అనుమాన ప్రమాణం ద్వారా జ్ఞానం కలగాలంటే, ఖచ్చితంగా ఉండవలసినవి : 1. రెండు విషయములు ఉండాలి. 2. ఆ రెండు విషయముల మధ్య అవినాభావ లేక మరేదైనా సంబంధం ఉండాలి. 3. ఆ సంబంధం అప్పటికే మన అనుభవంలోకి వచ్చి ఖరారై ఉండాలి. 4. ఆ రెండిటిలో ఒకటి ఇప్పుడు మన అనుభవంలోకి రావాలి. ఈ నాలుగు జరిగాక, ఇప్పుడు మన అనుభవంలో ఉన్న విషయంతో సంబంధంలో ఉన్న అనుభవంలో లేని విషయం గురించి మనం చేసే నిర్ణయాన్నే, అనుమాన ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానం అంటున్నాం. ఈ రకంగా జ్ఞానం ఏర్పడే పద్ధతిని అనుమాన ప్రమాణం అంటున్నాం. రెంటి సంబంధ జ్ఞానం పూర్వ అనుభవం కలిగి అది స్మృతిలో ఉండి, అందులో ఒకటి ప్రత్యక్షమవగానే రెండవదానిని ఊహించి తెలుసుకోవడాన్ని అనుమితి అనీ, ఆ పద్ధతిని అనుమాన ప్రమాణము అనీ అంటారు. ఉదా: పొగను చూసి నిప్పు ఉందని నిర్ణయానికి రావటం. గమనిక: అనుమాన ప్రమాణంలో అనుమానం అంటే సందేహం అని అర్థం కాదు..

Scene 14 (4m 0s)

శబ్ద ప్రమాణము. భాష (మాటల) ద్వారా విషయాలు తెలియబడడాన్ని శాబ్ది ప్రమ అనీ, భాష (మాటల) ద్వారా విషయాలు తెలియబడు పద్ధతినే శబ్ద ప్రమాణము అంటారు. భాష (మాటల) ద్వారా విషయాలు ఎలా తెలియబడతాయి? ఇక్కడ మనం భాష అంటే ఏమిటో కొంత తెలుసుకోవాల్సి ఉంది. భాష ఒక భావ వ్యక్తీకరణ సాధనము. మానవుడు తాను పొందిన అనుభవాలను వ్యక్తం చేయడానికి వాడుకుంటున్న వివిధ సంకేత రూపాల సమాహారమే భాష. జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసిన విషయాలు, మన మెదడులో స్మృతి కేంద్రంలో యథాతథ ముద్రలుగా ఏర్పడతాయి. ఆ తెలిసిన విషయాన్ని (ఏర్పడ్డ యథాతథ ముద్రలను) వ్యక్తం (చెప్పడానికి) చేయడానికి మనిషి ఏర్పరచుకొన్న వివిధ సంకేత రూపాలే భాష. యథాతథ ముద్రలే భాష యొక్క ప్రథమ రూపం. ఉదాహరణకు మనం ఏదైనా ఒక పండు తింటే, నాలుక ద్వారా దాని రుచి తెలుస్తుంది. అలా తెలియబడిన రుచి యొక్క అనుభవం మన మెదడులో ఏర్పరచినే స్మృతిచిహ్నమే యథాతథ ముద్ర. ఆ పండు రుచి మరొకరికి కూడా తెలియాలంటే అతను కూడా ఆ పండు రుచి చూడాల్సిందే. కానీ ఆ రుచికి మనం ఒక గుర్తును (సంకేతాన్ని) ఏర్పరచుకొని ఉంటే దానిని పలకడం ద్వారా మరొకరికి ఆ పండు రుచి ఎలా ఉందని మనకు అనిపించిదో (మన అనుభూతిని) చెప్పవచ్చు. ఈ గుర్తునే (సంకేతాన్నే) భాషలో ‘పదం’ అంటారు. ఆ పదాన్ని దేనిని సూచించడానికి వాడామో అది ‘పదార్థం’ అవుతుంది..

Scene 15 (4m 39s)

పరోక్ష జ్ఞాన పద్ధతులైన అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా తెలిసిన విషయం మనకి తెలిసిందనిపిస్తున్నా, వాస్తవానికి అది ఇంకా తెలియవలసే ఉంటుంది. అంటే అది ప్రత్యక్షజ్ఞానం కావలిసి ఉంటుంది. అయినప్పటికీ మానవజాతి అభివృద్దికి పై రెండు ప్రమాణాలూ ఎంతో దోహదం చేశాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే శాస్త్రజ్ఞులు అప్పటికి వారికి తెలిసిన విషయాల ఆధారంగా కొత్త విషయాలను ఊహించి, పరికల్పనలను రూపొందిస్తారు. వాటిని ఋజువు చేయడానికి ప్రయోగాలు చేస్తారు. అంతే కాకుండా నిత్య జీవితంలో కూడా జరగబోయే దానిని ముందుగా ఊహించి దాని కనుగుణంగా మనం మన ప్రణాళికలను రూపొందించుకుంటాం. మరి శబ్ద ప్రమాణం ముందు తరాల వారు గత అనుభవాలను గ్రంధస్థం చేసి భవిష్యత్ తరాలకు అందించడం ద్వారా జ్ఞాన సముపార్జనకు ఇంతకు వారు పడిన కష్టానష్టాలన్నీ వారి తదనంతరం పడాల్సిన అవసరం లేకపోయింది. కానీ అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా తెలిసిన జ్ఞానం పత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసిన జ్ఞానంతో పోలిస్తే తక్కువ విలువనే కలిగిఉన్నాయి. ఎందువలన అంటే? వాస్తవానికి అది ఇంకా తెలియవలసే ఉంటుంది కాబట్టి. కాకుంటే ప్రత్యక్ష జ్ఞానానికి ఉన్న ప్రధాన పరిమితి అయిన “సంఘటన జరిగే స్థల, కాలాల్లో ఉంటేగానీ తెలియక పోవడం” వలన అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా కూడా జ్ఞానార్జన చేయాల్సి ఉంది..

Scene 16 (5m 16s)

కలిగిన జ్ఞానం ఎన్ని రకాలు:. మూడు విధాలుగా కలిగే జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది. అవి ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము. వీటినే ప్రమ, భ్రమ అని గానీ లేక యథార్థ జ్ఞానము, అయథార్థ జ్ఞానము అని గానీ అంటారు. ప్రమ: ఉన్నది ఉన్నట్లుగా తెలిస్తే ఆ జ్ఞానాన్ని ప్రమ లేదా ఒప్పు జ్ఞానము అంటారు. ప్రమకు పర్యాయపదమే సత్యము. భ్రమ: లేనిది ఉన్నట్లుగా తెలియటాన్ని మరియు ఉన్నది ఉన్నట్లుగా కాక మరొకలా తెలియటాన్ని భ్రమ లేదా తప్పు జ్ఞానము అంటారు..

Scene 17 (5m 36s)

భ్రమ ఎలా కలుగుతుంది?. ఉన్నది ఉన్నట్లుగా తెలియకుంటే, అనగా లేనిది ఉన్నట్లుగా గానీ లేక ఉన్నది ఉన్నట్లుగా కాక మరొకలా తెలియటాన్ని భ్రమ లేదా తప్పు జ్ఞానము అంటారు. భ్రమ కలిగే పరిస్థితుల గూర్చి తెలుసుకుంటే వాటిని నివారించి ప్రమ కలిగేటట్లు జాగ్రత్త వహించవచ్చు. కాబట్టి మనం భ్రమ ఎలా కలుగుతుందో తెలుసుకోవాల్సి ఉంది. “ప్రమాకరణం ప్రమాణం” అని అంటే ప్రమను కలిగించునది ప్రమాణం అని పూర్వీకులు భావించారు. కానీ ఏయే ప్రమాణాల ద్వారా ప్రమ కలుగుతుందో, భ్రమ కూడా ఆయా ప్రమాణాల ద్వారా కలుగుతుందని మన అనుభవాలని పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి మూడు ప్రమాణ పద్ధతుల ద్వారా మరియు ఆరు ఇంద్రియాల ద్వారా భ్రమ కలిగే అవకాశం ఉంది..

Scene 18 (6m 0s)

ప్రత్యక్ష ప్రమాణంలో భ్రమ ఎలా కలుగుతుంది?. బాహ్య కారణాలు: ఇంద్రియాలు సరిగనే ఉండి, మనస్సూ(బుద్ధి) సరిగనే ఉన్నప్పటికీ విషయాలు ఉన్నది ఉన్నట్లుగా అనిపించకపోడానికి గల కారణాలు, ఇంద్రియాలకు సమాచారం చేరుటలోనే లోపం ఉన్నట్లయితే అట్టి వాటిని ఆయా భ్రమలకు బాహ్యకారణాలు అనంటాము. నేత్ర భ్రమలు: కంటి ద్వారా తెలియబడే ఎన్నో విషయాలలో బాహ్య కారణాల వల్ల నే భ్రమలు కలుగుతుంటాయి. ఉదాహరణ: 1. ఎండమావులు(వేసవికాలంలో తారురోడ్డు మీద వెళుతుంటే దూరంగా మనకు నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది, కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. 2. నీటిలో కర్రను ముంచితే అది వంగినట్లు కనబడుతుంది, కానీ కర్ర వంగదు..

Scene 19 (6m 23s)

నాలుక ద్వారా కలిగే భ్రమలు: 1. అతి తీపి పదార్థాలు తిన్నాక వెంటనే సాధారణ మధుర పదార్థాలు లేదా కాఫీ టీ లాటివి తీసుకుంటే ఉన్నట్లు అనిపించడం రుచికి సంబంధించిన భ్రమ. 2. ఉసిరి కాయ తిన్నాక మంచినీళ్ళు తాగితే అవి తియ్యగా ఉన్నట్లనిపిస్తుంది.(ఇది రసాయనిక భ్రమ.) చెవి ద్వారా కలిగే భ్రమలు: 1. స్టీరియో శబ్దాలు వింటున్నప్పుడు రెండు వైపుల నుండి శబ్దాలు వస్తున్నా తలపై నుండి శబ్దాలు వస్తున్నట్లుండడం బాహ్య కారణం వల్ల కలిగే శబ్ద భ్రమే. స్పర్శ ద్వారా కలిగే భ్రమలు: 1. ఒక చేతిని అధిక వేడి కలిగిన నీటిలోనూ, రెండవ చేతిని అతి శీతలంగా ఉన్న నీటిలోనూ కొద్దిసేపు ఉంచి తరువాత ఒక బకెట్టులోని నీళ్ళలో ఆ చేతులను ఉంచితే మొదటి చేతి స్పర్శ ద్వారా బకెట్లో చల్లని నీళ్ళున్నట్లు, రెండవ చేతి స్పర్శ ద్వారా వెచ్చని నీళ్ళున్నట్లూ అనిపిస్తుంది.ఇదీ స్పర్శకు చెందిన భ్రమ ఇంద్రియ లోపాల కారణంగా కలిగే భ్రమలు : 1. రాత్రిపూట దూరాన ఉన్న లైట్లు, రెండుగా గాని, పొడుగ్గానో, వెడల్పుగానో గాని కనిపించటం. 2. దూరదృష్టి, హ్రస్వదృష్టి కారణంగా సరిగా కనిపించక పోవడం. 3. రంగుల్ని యథాతథంగా గమనించలేక పోవడం. ముక్కు ద్వారా కలిగే భ్రమలు: ముక్కు చెడిపోయినప్పుడు వాస్తవంగా ఉన్న వాసనలు లేనట్లు అనిపిస్తుంటుంది..

Scene 20 (7m 3s)

2.మానసిక భ్రమలు: రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలు: 1 . గంజాయి, నల్లమందు లాటి మాదక ద్రవ్యాల వల్ల గాలిలో తేలిపోతున్నట్లు, దారి ఎగుడుదిగుడులుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. అలాటి వాటిని రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలంటారు. మానసిక ఆరోగ్య లోపం వలన ఏర్పడే భ్రమలు: గమనిక :- భ్రమలకు ఎన్ని రకాల కారణాలుండే వీలుందన్న విషయంపై శాస్త్రీయ పరిశోధనలెన్నో జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఎన్ని రకాలుగ భ్రమలుండే వీలుందో అర్ధం చేసుకుని, అవి ఏర్పడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్త లేమిటో తెలిసికుని, వినియోగించుకోవడం అలవరచుకుంటే జీవితంలో తరచుగా తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలను ఆరోగ్యంగా ఉంచుకోవదమూ, తగినంత సమాచారం పొందగలిగే టట్లు ఇంద్రియాలను ఉపయోగించడం, ఏకాగ్రత వహించడం వంటి జాగ్రత్తలతో భ్రమలను నివారించు వీలుంది..

Scene 21 (7m 30s)

అనుమాన ప్రమాణంలో భ్రమ ఎలా కలుగుతుంది?. ఏదైనా ఆధారం ద్వారా, ప్రత్యక్షంలో లేనిదాన్ని ఊహించడాన్ని “అనుమాన ప్రమాణం” అన్నాం కదా! అయితే అట్టి ఊహకు ఆధారమైనది లేక హేతువు నకు “ఆధారపడ దగినట్టి” శక్తి లేనట్లయితే తప్పు జ్ఞానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ‘హేతువు’ నకు ఉండాల్సిన పక్షసత్వము, సపక్షసత్వము, విపక్షాసత్వము అనేవి ఉండాలి. 1. పక్షము: దేని ఆధారంతో దేనిని ఊహిస్తున్నామో అది ఉన్న చోటును పక్షమంటాము. పక్షంలో (ఆ చోటులో) ఇది, ఉండగలగాలన్నమాట. 2. సపక్షము: గతంలో ఏ అనుభవం (సంఘటన) ఫలానా రెంటి మధ్య బలమైన సంబంధం వుందని గుర్తించడానికి ఆధారమైయ్యిందో ఆ సంఘటన జరిగిన తావు సఫక్షం. సపక్షానికి చెందిన జ్ఞానమే గతంలో కలిగి వుండేది. దీనినే తార్కిక ఉదాహరణ అనంటారు. 3. విపక్షం: ఏది ఉంటే మనం హేతువుగా ఎంచుకోవాల్సింది ఉండలేదో అది విపక్షం. పక్షంలో ఉండగలగాలి, సపక్షంలో ఉందని తెలిసి ఉండాలి, విపక్షంలో హేతువును ఉండలేదని తెలియాలి. ఇలా తెలిసినవాడు చేసే ఆలోచనలోనే సరైన ఎంపిక చేసుకునే సామర్థ్యం ఇమిడి వుంటుంది..

Scene 22 (8m 3s)

శబ్ద ప్రమాణంలో భ్రమ ఎలా కలుగుతుంది?. భాష (మాటల) ద్వారా విషయాలు తెలియబడు పద్ధతినే శబ్ద ప్రమాణమన్ నాం కదా! చెప్పినంత మాత్రాన భావప్రసారం జరుగుతుందా? అన్నది తెలుసుకోవాలి అంటే ముందుగా భాష యొక్క పుట్టుక శక్తి, పరిమితులు తెలియాలి. భాష పుట్టుక: జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసిన విషయాలు, మన మెదడులో స్మృతి కేంద్రంలో యథాతథ ముద్రలుగా ఏర్పడతాయి. ఆ తెలిసిన విషయాన్ని (ఏర్పడ్డ యథాతథ ముద్రలను) వ్యక్తం (చెప్పడానికి) చేయడానికి మనిషి ఏర్పరచుకొన్న వివిధ సంకేత రూపాలే భాష. యథాతథ ముద్రలే భాష యొక్క ప్రథమ రూపం. ఉదాహరణకు మనం ఏదైనా ఒక పండు తింటే, నాలుక ద్వారా దాని రుచి తెలుస్తుంది. అలా తెలియబడిన రుచి యొక్క అనుభవం మన మెదడులో ఏర్పరచినే స్మృతిచిహ్నమే యథాతథ ముద్ర. ఆ పండు రుచి మరొకరికి కూడా తెలియాలంటే అతను కూడా ఆ పండు రుచి చూడాల్సిందే. కానీ ఆ రుచికి (రుచి యొక్క అనుభవం మన మెదడులో ఏర్పరచినే స్మృతిచిహ్నానికి) మనం ఒక గుర్తును (సంకేతాన్ని) ఏర్పరచుకొని ఉంటే దానిని పలకడం ద్వారా మరొకరికి ఆ పండు రుచి ఎలా ఉందని మనకు అనిపించిదో (మన అనుభవాన్ని) చెప్పవచ్చు. ఈ గుర్తునే (సంకేతాన్నే) భాషలో ‘పదం’ అంటారు. ఆ పదాన్ని దేనిని సూచించడానికి వాడామో అది ‘పదార్థం’ అవుతుంది..

Scene 23 (8m 39s)

భాషకు పరిమితి ఉంది. ఇదీ మూలాంశం . ఇక్కడో సమస్య ఉంది. మనం ఆ రుచికి ఏ గుర్తు (సంకేతం, పదం) ఏర్పరచుకున్నామో రెండవ వానికి కూడా ఆ గుర్తు (సంకేతం, పదం) తెలిసి ఉండాలి. అంతే కాదు మనం ఏ రుచికి అనగా ఏ పదార్ధానికి ఆ గుర్తు (సంకేతం, పదం) వాడుతున్నామో రెండవ వ్యక్తికి కూడా ఆ గుర్తు (సంకేతం, పదం) అదే రుచికి అనగా పదార్ధానికి ఉపయోగిస్తున్న (తెలిసిన) వాడై ఉండాలి. అంటే సమాన పదాలకు సమాన పదార్ధాలు ఉంటేనే మన భావం రెండవ వానికి చేరుతుందన్నమాట. ఇది భాష యొక్క కీలక పరిమితి. ఉదాహరణకు: “బస్” అనే శబ్దాన్నిచ్చే పదాన్ని ఆంగ్లంలో ఈ వాహనాన్ని తెలియజేయడానికి వాడితే, హిందీలో ఇక చాలు అని చెప్పడానికి వాడతారు. అంటే ఇక్కడ సమాన పదాలకు సమాన పదార్ధాలు లేవన్న మాట! అలా కాకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మూడు సందర్భాలు ఉన్నాయి: 1. మనం ఉపయోగించిన పదం రెండవ వానికి తెలియక పోతే మన భావం అతనికి చేరదు. ఉదా: ఆంగ్లం మాత్రమే తెలిసిన వాడితో మనం “ పండు తియ్యగా ఉంది” అంటే అతనికి మన భావం తెలియదని మనకు తెలిసిన విషయమే. 2. మనం ఉపయోగించిన పదం రెండవ వానికి తెలిసి దాని అర్ధం (పదార్థం) వేరుగా ఉంటే మన భావం తప్పుగా (వేరొకలా) చేరుతుంది. ఉదా: హిందీ మాత్రమే తెలిసిన వాడితో మనం ఆంగ్లంలో ఒక వాహనం అయిన “బస్” అని అంటే అతనికి చాలు అనే భావం స్ఫురిస్తుంది. 3. మనం ఉపయోగించిన పదం రెండవ వానికి తెలిసి, దాని అర్ధం (పదార్థం) కూడా మనకు తెలిసిన అర్ధంగా (పదార్థంగా) తెలియబడి నప్పుడు మాత్రమే మన భావం సరిగ్గా అతనికి చేరుతుంది..

Scene 24 (9m 27s)

శబ్ద ప్రమాణం ద్వారా సరైన జ్ఞానం కలగాలంటే , 1. సంకేత, సంకేతి (పద, పదార్థ) సంబంధ జ్ఞానము గతములో ఇద్దరికీ తెలిసివుండాలి. 2. ఇప్పుడు కొన్ని సంకేతములు (పదములు) ప్రత్యక్షములో తెలియబడాలి. అప్పుడు రెండవ వానికి విషయం తెలియ బడుతుంది. గమనిక: సంకేతములు అంటే శబ్దాలు మాత్రమే కాదు. సంజ్ఞలు కావచ్చు, చిత్రములు కావచ్చు, బైనరీ కోడ్ లాగ విద్యుత్తు ప్రవాహంలో మార్పు కూడా కావచ్చు. భాష ద్వారా వ్యక్తి ఏం అంటున్నాడో (అతని భావం) తెలుస్తుందే తప్ప వాస్తవంలో అలా ఉందో లేదో తెలియదు. ఇది భాష యొక్క రెండవ పరిమితి. ఉదాహరణకు “నేను తిన్న పండు పుల్లగా ఉంది” అని ఎవరయినా అంటే ఆ వ్యక్తి, తాను తిన్న పండు పుల్లగా ఉందని చెప్పాడని తెలుస్తుందే కానీ, ఆ పండు యొక్క రుచి పులుపో, కాదో మనకు తెలియదు. మనకు కూడా తెలియాలంటే ఆ పండును రుచి చూడడం తప్ప వేరే దారి లేదు. కాబట్టి భాష ద్వారా తెలిసేది కేవలం ఎదుటి వాడు ఏమి చెబుతున్నాడో తెలుస్తుంది గానీ, మనకు అ విషయం సత్యమో, కాదో తెలియబడదు అంటే ప్రత్యక్షం కాదు. ముఖ్యంగా: మనం ఉపయోగించిన పదం రెండవ వానికి తెలిసి దాని అర్ధం (పదార్థం) వేరుగా ఉంటే తప్పు జ్ఞానం “భ్రమ” కలుగుతుంది. పైగా ప్రత్యక్షం కాకపోవడం వలన తెలిసికోకుండాగానే తెలిసింది అన్న భ్రాంతి కలుగడం మరింత ప్రమాదకరంగా తయారవుతుంది..

Scene 25 (10m 10s)

శబ్ద ప్రమాణం ద్వారా భ్రమ కలుగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి.?.

Scene 26 (10m 48s)

మరైతే భాష ద్వారా ఎదుటి వాడు చెప్పినది యథాతథంగా చేరిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఇందుకు చెప్పిన (రాసిన) వానిని అడిగి నిర్ధారించు కోవడం మాత్రమే ఉన్న ఏకైక మార్గం. రచయిత అందుబాటులో లేనపుడు రచన ద్వారా చేరినది సరిగ్గానే ఉందో? లేదో? నిర్ధారించుకోవడం ఎలా? అందుకు అధ్యయన పద్ధతి మరియు నవ పద వివేకము తెలిసి ఉండాలి. అధ్యయన పద్ధతి భాష ద్వారా అందిన (విన్న లేక చదివిన) సమాచారం సత్యమా? అసత్యమా? సాధ్యమా? అసాధ్యమా? సరైనదా? కాదా? అని తెలుసుకోవాలి అనుకుంటే ఆ సమాచారాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేయటానికి ఉపకరించే పద్ధతే అధ్యయన పద్ధతి. చదివిన (విన్న) భాగానికి ఈ పద్ధతిని అవలంబించటం ఎలాగంటే, చదివిన (విన్న) భాగంలో.. 1. ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 2. ఎన్ని అభిప్రాయ ప్రకటనలు ఉన్నాయి? 3. అందులో కఠినమైన పదాలు ఏమన్నా ఉన్నాయా? అందులో అర్థం కాని వాక్యాలు ఎన్ని? 4. అందులో ఎన్ని అర్థమయ్యాయి? 5. అందులో ఒప్పులెన్ని, తప్పులెన్ని, తేలనివెన్ని?.

Scene 27 (11m 19s)

నవ పద వివేకం (తొమ్మిది పదాలపై అవగాహన). 1.పదము: అర్ధాన్ని కలిగి ఉన్న అతి చిన్న భాషా భాగము. (అర్థయుక్త అత్యల్ప భాషా భాగము.) అంటే పదము విన్నపుడు లేక చదివినప్పుడు దానికి సంబంధించిన ఏదో ఒక అనుభవం స్ఫురించాలన్న మాట. 2.పదార్థము: పదానికి భాష అంగీకరిస్తున్న అర్థము. (పదస్య అర్ధః పదార్థః) పదము విన్నపుడు లేక చదివినప్పుడు దానికి సంబంధించి స్ఫురించిన అనుభవమే పదార్థము పదము చేత ఏదైతే సూచించ బడుతుందో అది ఆ పదము యొక్క పదార్థము. 3.పర్యాయపదము: ఒక పదము దేనిని సూచిస్తుందో, దానినే సూచించు మరొక పదము. అనగా ఒక పదమునకు బదులుగా వాడదగిన మరియొక పదం. 4.వాక్యము: కనీసం ఒక అభిప్రాయాన్నైనా వ్యక్తం చేయగలిగే వ్యాకరణ బద్ధమైన పదముల సముదాయము. (కర్త, కర్మ, క్రియలతో కూడినటువంటి పద సముదాయాన్ని వాక్యము అంటారు.) 5. నిర్వచనము: పదము యొక్క సంపూర్ణ అర్థాన్ని ఇచ్చు సంక్షిప్త పద సముదాయము. ఒక పదము యొక్క పూర్తి అర్థాన్ని వీలైనన్ని తక్కువ మాటలతో వ్యక్తపరచగల ప్రకటన..

Scene 28 (11m 54s)

ఒక పదమునకు నిర్వచనము చెప్పడము అంటే ఆ పదము సూచించు పదార్థము లక్షణము చెప్పడమే. ఇక్కడ లక్షణము అంటే పదార్థము యందు గల అసాధారణ ధర్మము లేక విశేష గుణము అని అర్థము. నిర్వచనము ఈ క్రింది మూడు దోషాలూ లేనిదై ఉండాలి. దోషత్రయం(మూడు దోషాలు) అతివ్యాప్తి దోషము ఒక పదానికి చేసిన నిర్వచనము ఆ పదము సూచించ వలిసిన వాటినే కాకుండా వేరే వాటిని (ఇతరాన్ని) కూడా సూచిస్తే ఆ నిర్వచనానికి అతివ్యాప్తి దోషము ఉందని అంటాము. అవ్యాప్తి దోషము ఒక పదానికి చేసిన నిర్వచనము ఆ పదము సూచించ వలిసిన వాటి అన్నింటిని కాకుండా కొన్నిటినే సూచిస్తే ఆ నిర్వచనానికి అవ్యాప్తి దోషము ఉందని అంటాము. అసంభవ దోషము ఒక పదానికి చేసిన నిర్వచనము ఆ పదము సూచించవలిసిన ఒక్క దానిని కూడా సూచించలేకపోతే ఆ నిర్వచనానికి అసంభవ దోషము ఉందని అంటాము..

Scene 29 (12m 19s)

6.వివరణ: పదాన్ని నిర్వచించినప్పుడు అది ఎదుటివారికి సులభంగా అర్ధం కావటం కోసం అదనపు సమాచారాన్ని జతచేసి చూపే విశదీకరణ రూపమే వివరణ అంటే. 7. ఉపమానము: ఒక దానిలో గల ఒక అంశాన్ని బాగా పెద్దది లేక చిన్నదిగా చూపించటం కోసం అట్టిది కాని మరొక దానిలో ఉన్న పోల్చదగిన అంశంతో పోల్చి చూపడాన్ని ఉపమానము అంటాము. గమనిక: ఉపమానంలో పోల్చుటకు తీసుకున్న రెండు విషయాలూ సజాతివి కాదన్న విషయాన్ని గ్రహించండి.. ఉపమానానికి ఉదాహరణ: ఆమె మోము చంద్ర బింబం వలె అందంగా వున్నది. పై ఉదాహరణలో ఆమె యొక్క మోము చాలా అందంగా ఉంది అని చెప్పడం కోసం, వేరొక జాతి అయిన చంద్రబింబంతో పోల్చి చెప్పబడింది. 8.ఉదాహరణ: ఒక అభిప్రాయము సరైనదే నని ఋజువు చేయగలది ఉదాహరణ. ఏ అనుభవాన్ని ఆధారము చేసుకొని ఒక అభిప్రాయ ప్రకటన చేశామో, అట్టి అనుభవాన్నే కలిగించగల మరో ఘటననే ఉదాహరణ అంటాము. 9.నిర్ధారణ: ఒక ప్రతిపాదిత అంశాన్ని సత్యాసత్య విచారణకు లోను చేసిన సందర్భంలో విచారణ పర్యవసానంగా ఏర్పడ్డ నిర్ణయ రూపాన్నే నిర్ధారణ అంటారు. నిర్ధారణ అన్నది ప్రతిపాదితాంశము సరైనది అని కానీ, సరికానిది అని కానీ, అప్పటికి ఇంకా తేలనిది అని కానీ అనే మూడు రూపాలలో ఏదో ఒకటిగా మాత్రమే ఉంటుంది. పై విషయాలను అనుసరించుట ద్వారా శబ్ద ప్రమాణ భ్రమలను తగ్గించుకునే వీలుంది..

Scene 30 (13m 0s)

భాష (శబ్దప్రమాణం) వలన ప్రమాదం ఏర్పడుతున్నది. ఇదీ మూలాంశం: ప్రస్తుతం భాష ద్వారా విస్తారమైన సమాచారం అందుబాటులో ఉంది. ఆ సమాచారం యొక్క సత్యా సత్యాలు విచారించకనే ఇతరులకు పంచడం, వ్యాఖ్యానించడం, వాగ్యుద్ధాలు జరగడం తరచూ మన జీవితంలో జరుగుతున్న విషయమే. ఉదాహరణకు “వాట్సప్ ద్వారా ఒక సమాచారం వచ్చింది. దానిని 10మందికి షేర్ చేస్తే బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుందని అందులో ఉంది.” మేరేమి చేస్తారు? వెంటనే 10మందికి షేర్ చేస్తారా? లేక ఆలోచిస్తారా? ప్రస్తుతం మనమున్న ఈ సమాచార యుగంలో ప్రతీ వ్యక్తీ తనను తాను తెలియకనే తెలుసుననుకుంటూ, తాను పంచిన సమాచారంపై ఎవరయినా ప్రశ్నిస్తే దానిని ఎదుర్కోలేక ఎదురు దాడి చేయడం జరుగుతుంది. దీనికంతటికీ శబ్దప్రమాణంపై అవగాహన లేకపోవడం, సత్యా సత్యాలను తేల్చుకొనే పద్ధతి తెలియక పోవడమే. కాబట్టి పైన తెలిపిన విషయాలను సాకల్యంగా అవగాహించి తగు రీతిని జీవనం గడుపుకోవడం మంచిది..

Scene 31 (13m 29s)

పదార్థ వివేచన. పదార్థ వివేచన అనేది ప్రకృతిలో గల పదార్థాలను వర్గీకరించుట అని చెప్పవచ్చు. గతంలో తాత్వికులు ఈ వర్గీకరణ పలురకాలుగా చేసి ఉన్నారు. ఒక పదము దేనిని సూచించునో అది పదార్థం. అనగా “పదము యొక్క అర్ధం పదార్థం” అనే మనం ఈ సందర్భంలో గమనించ వలసినది. కనుక భాషలో ఉపయోగిస్తున్న పదాల వర్గీకరణయే ఈ పదార్థ వివేచన. వర్గీకరణ యొక్క ఆవశ్యకత: వర్గీకరణ అనేది మనం చేసే పనిని సులభతరం చేస్తుంది. ఉదాహరణకు మనం గ్రంథాలయానికి వెళితే అక్కడ ఉన్న వందలాది పుస్తకాలలో మనకు కావలిసిన పుస్తకం ఎంచుకోవడం అంత సులభమేమీ కాదు. అందుకే గ్రంథాలయాలలో పుస్తకాలను విషయాల వారీగా, రచయితల వారీగా, ఇంకా పాఠకుల వయస్సుల వారీగా అమరుస్తారు. అందువలన మనకు కావలిసిన పుస్తకం వెతకడం సులభ మవుతుంది. ఇట్లే పదార్థాలను కూడా వర్గీకరించుట వలన అధ్యయనం సులభ మవుతుంది..

Scene 32 (13m 56s)

పదార్థ వర్గీ కరణ. పదార్థాలను “పదార్థ ప్రధాన వర్గీ కరణ, పదార్థ ఉప వర్గీ కరణ” అనే రెండు విధాలు అవసరమని మండలి భావిస్తుంది. అయితే వర్గీకరణ అనునది ఎవరి సౌలభ్యం మేరకు వారు వర్గీకరించవచ్చు. అయితే అఅ వర్గీకరణలో అన్ని పదార్థాలూ చేరి ఉండటం ముఖ్యం. పదార్థ ప్రధాన వర్గీ కరణ: ద్రవ్యము, వస్తువు, గుణము, క్రియ మరియు సంబంధములనే వర్గీకరణను ప్రధాన వర్గీకరణ అంటున్నాము. ప్రకృతిలో గల అన్ని పదార్థాలూ ఈ ఐదింటిలో ఏదో ఒక వర్గమునకు చెంది ఉంటాయి. పదార్థ ఉప వర్గీ కరణ: భౌతిక పదార్థాలూ, భావ పదార్థాలు అనుభవాత్మకాలు, ఊహాత్మకాలు, కాల్పనికాలు, భ్రాంతులు. స్వయం సత్తాకాలు, సంబంధ జనితాలు, సాపేక్షిక-నిరపేక్షిక సంబంధ జనితాలు..

Scene 33 (14m 23s)

పదార్థ ప్రధాన వర్గీ కరణ. ద్రవ్యము : స్వతంత్ర ఆవరణ కలిగి స్థల, కాలాల్లో ఉనికి కలిగినది “ద్రవ్యము” వస్తువు: ఒక ప్రత్యేక ఆకృతిలో గల ద్రవ్యము :వస్తువు” గుణము: ద్రవ్యా న్ని ఆశ్రయించి ఉండి, ఇంద్రియ గోచరమైనదీ, క్రియ కానిదీ “గుణము” క్రియ: ద్రవ్యా న్ని ఆశ్రయించి ఉండి, ఇంద్రియ గోచరమైనదీ, గుణము కానిదీ “క్రియ” ఇక్కడ ద్రవ్యానికీ, గుణమునకూ నిత్య సంబంధం ఉండగా, ద్రవ్యానికీ, క్రియ కూ నిత్య సంబంధం ఉండదు. సంబంధము: ఒకటి తెలియడానికి మరి యొకటి కూడా తెలియ వలసి ఉంటే ఆ రెంటి మధ్య గల దానిని “సంబంధము” అంటారు ..

Scene 34 (14m 46s)

పదార్థ ఉప వర్గీ కరణ:. భౌతిక పదార్థాలూ : పంచేంద్రియాలతో తెలియబడేవి. భావ పదార్థాలు: అంతరింద్రియము తో తెలియబడేవి. అనుభవాత్మకాలు: షట్ ఇంద్రియముల తో తెలియబడేవి. ఊహాత్మకాలు: షడింద్రియముల తో తెలియబడనప్పటికీ అనుమాన ప్రమాణము ద్వారా తెలియబడేవి. కాల్పనికాలు: ఎట్టి ఆధారమూ లేకనే కల్పించబడినవి. వీటికి ఉనికి లేదు. ఉదా: కుందేటి కొమ్ము. భ్రాంతులు: లేనివి ఉన్నట్టుగా తెలియబడేవి. ఉదా: ఎండమావి. స్వయం సత్తాకాలు: దానికదే తెలియబడేది. తెలియబడానికి వేరొక దానితో అవసరం లేనిది. సంబంధ జనితాలు: వేరొకటి తెలిస్తే తప్ప దానికదే తెలియబడనిది. సాపేక్షిక-నిరపేక్షిక సంబంధ జనితాలు:.

Scene 35 (15m 10s)

ముగింపు. ఏ విద్య అన్నీ విద్యలకూ ఆధారమూ, ఏది తగినంతగా తెలియకుంటే తెలిసిన ఇతరాలన్నీ అనుకున్నంత సఫలతనీయ జాలవో, ఎట్టి విద్య జీవనాన్ని సులభసాధ్యం చేయ గలదో ఆ విద్యే “లక్షణ ప్రమాణ విద్య” ఈ విద్యను అభ్యసించిన వారు తమతమ రంగాలలో అభ్యసించని వారి కంటే నిస్సందేహంగా ముందు వరుసలో ఉంటారు. ఏలనంటే వారి ఆలోచనలో నిర్ధిష్టత, సూటిదనమూ, అలాగే అవగాహించుటలో నైపుణ్యమూ సిద్ధిస్తాయి. తమతమ అనుభవాలను పరీక్షించు కొనడం ద్వారా ఈ విద్యను అభ్యసించి తగు పొందగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను..